Headlines

సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం: మంత్రి కొట్టు..

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, మార్చి26:

సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామంలో మంగళవారం పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రామంలో పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. 2014 ఎన్నికల్లోను టిడిపి బిజెపి జనసేన కూటమి కలిసి పోటీ చేశాయని, ఆనాడు చంద్రబాబు ఇచ్చిన 650 హామీలు ఏమయ్యాయి అని కొట్టు ప్రశ్నించారు. మళ్లీ ఇదే కూటమి మాయ మాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయి అన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 2009లో చిరంజీవి అధికారం కోసం ప్రజారాజ్యం పార్టీని పెడితే, నేడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కోసం జనసేన పార్టీ పెట్టారని విమర్శించారు. జనసేన రాజకీయ పార్టీ కాదని షామియానా కంపెనీ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా నేరుగా ఆర్థిక లబ్ధి పొందిన మహిళలు నేడు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రెండేళ్లు కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి మహిళల ఖాతాలలో డబ్బులు వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ పిట్టలదొల కబుర్లు అని మంత్రి కొట్టు ఎద్దేవా చేశారు. సంక్షేమ పాలనతో సంతోషంగా ఉన్న ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి ప్రజాభిమానాన్ని ఓటు రూపంలో మలుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. బి.కొండెపాడు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, బి.కొండేపాడు ఎంపీటీసీ దేవరశెట్టి సత్యనారాయణ, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సంపతరావు కృష్ణారావు, పెంటపాడు మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కట్టుబోయిన కృష్ణ ప్రసాద్ లు మాట్లాడారు. తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు మండలం పార్టీ గౌరవ అధ్యక్షులు, దర్శిపర్రు సొసైటీ చైర్మన్ గుండుమోగుల సాంబయ్య, పెంటపాడు మండలం జేసిఎస్ కన్వీనర్ మైలవరపు పెద్దబాబు, రావిపాడు సొసైటీ మాజీ ప్రెసిడెంట్ మునగాల బాబ్జి, బి.కొండెపాడు మాజీ ఎంపీటీసీ పాలా గణపతి, తాడేపల్లిగూడెం వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కారింకి వీర్రాజు, కొట్టు విశాల్, దేవా వెంకటరమణ, కుమార్ స్వామి, చింతపల్లి శ్రీనివాస్, రావిపాడు సర్పంచ్ పెన్నాడ సూరిబాబు, బి.కొండేపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు మర్రే కృష్ణమూర్తి, దేవరశెట్టి సత్యనారాయణ, దేవరశెట్టి రాము, ఆలపాటి సాంబయ్య, బోడే శ్రీను, బండారు అప్పన్న, వీరవల్లి గోపాలం, గూడూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.