Headlines

సమయం లేదు సమైక్యంగా పనిచేద్దాం..- తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి బొడిశెట్టి..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 2:

అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎంతో లేదని బిజెపి, జనసేన, టిడిపి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ప్రజలకు దగ్గర ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని గురుజి సూరిబాబు నివాసం వద్ద మూడు పార్టీల ముఖ్య నాయకుల ఎన్నికల సమయత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ పట్టణంలో మూడు పార్టీల పట్టణ అధ్యక్షులు సమిష్టిగా ఓటర్ల జాబితాను సమీక్షించి వారి దగ్గరకు కూటమి ఎజెండాలు తీసుకెళ్తామని సూచించారు. అదేవిధంగా గ్రామాలు వార్డుల వారీగా నాయకులు కార్యకర్తలు సమిష్టి బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మాట్లాడుతూ పట్టణం, గ్రామాల్లో ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా ఉందని వార్డుల వారీగా మనమే బాధ్యతగా ఓటర్ల దగ్గరకు వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించాలని సూచించారు. అదేవిధంగా వైసీపీ అరాచకాలకు పాల్పడ ఎన్నికల కమిషన్ పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు అంటగట్టే ప్రయత్నం వైసిపి నాయకులు చేస్తున్నారని వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని కోరారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నాయకుడు ఎన్నికలు జరిగే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్రంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలకు మనం చేసే పనులను ప్రతి ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.