Headlines

శ్రీ కనకదుర్గ అమ్మవారి (చతుర్ద) 4వ జాతర మహోత్సవాలకు బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారికి ఆహ్వాన పత్రికను అందజేసిన… శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయ సేవా సమితి ఆలయ కమిటీ నిర్వాహకులు..

బూర్గంపాడు 2 న్యూస్ 9.

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారిని మంగళవారం నాడు శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయ సేవాసమితి వారు మర్యాదపూర్వకంగా కలిసి సారపాక సాకేతపురి గాంధీనగర్ ఏరియా లో ఈనెల 8వ తేదీ నుండి 10 తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చతుర్ధ 4వ మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో రావాలంటూ వారికి ఆహ్వాన పత్రికను శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవాలయ సేవా సమితి వారు అందజేయడం జరిగింది…, ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెల్ది శివసాయి కుమార్ శర్మ , ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సిలివేరు వీరాంజనేయులు, కార్యవర్గ సభ్యులు భూక్య రమేష్, సత్య సాయి మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు…