Headlines

మళ్లీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేద్దాం..

న్యూస్ నైన్ టీవీ YGR

 

12.04.2024 తేదీన పట్టణంలోని మిలిటరీ కాలనీ దరగా దగ్గర నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, వార్డ్ కౌన్సిలర్ రజిత ప్రతాపరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మిగనూరులో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేద్దామని ఎమ్మిగనూరు నియోజవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక పిలుపునిచ్చారు.29 వ వార్డు మిలిటరీ కాలనీ లో ఇంటింటికీ తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. వార్డులో వృద్ధులను, మహిళలను, వివిధ వృత్తుల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పపాదయాత్రలో ప్రజల ఇబ్బందులను చూసి వారి అభివృద్ధికి నవరత్నాల పథకాలు తీసుకువచ్చారన్నారు. గతం లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులందరినీ ప్రజల దగ్గరకు పంపించారని చెప్పారు. దీంతో ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేసిన మేలు వారికి వివరించడంతో పాటు ఇంకా అవసరమైనవి ఏమైనా ఉంటే తెలియ జేసే అవకాశం కల్పించారన్నారు.

 

ఈ ప్రచారంలో బుట్టా శివ నీలకంఠ గారు,వార్డ్ నాయకులు పామయ్య,నరసింహులు, శివారెడ్డి,తేజా రెడ్డి,గోకరమ్మ,నారాయణ,శివ,పాండు,నాగరాజు, తిప్పలి వెంకటేష్ పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య,పట్టణ అధికార ప్రతినిధిసునీల్ కుమార్, రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్ వక్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్ అబ్రార్,కౌన్సిలర్లు డిష్ కేశవరెడ్డి ఇన్చార్జులు వడ్డే వీరేష్,తార రాజశేఖర్, నాయకులు మహేశ్వర్ రెడ్డి,మంజునాథ్, వెంకటేశ్వర్ రెడ్డి,సలీం,యూసుఫ్,ప్రభాకర్, బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు