ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్..

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది.

17,425 మందికి 15,688 మంది పాసయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది.

34,156 మందికి 29,707 మంది పాసయ్యారు.

ఫస్ట్ ఇయర్ లోనూ 84 శాతంతో కృష్ణా తొలిస్థానంలో నిలిచింది.

20,324 మందికి 17,070 మంది పాసయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా 79 శాతంతో 3వ స్థానంలో నిలిచింది.

38,307 మందికి 30,353 మంది పాసయ్యారు.

వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు*

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు.

మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు.

సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి.

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది.

ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి. తెలిపారు