Headlines

బాబును నమ్మి మోసపోవద్దు..28 వ వార్డ్ వెంకటాపురం శివాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై.రుద్ర గౌడ్ గారు వార్డు కౌన్సిలర్ బజారి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

బాబును నమ్మి మోసపోవద్దు

14.04.2024 తేదీన సాయంత్రం 28 వ వార్డ్ వెంకటాపురం శివాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై.రుద్ర గౌడ్ గారు వార్డు కౌన్సిలర్ బజారి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆపార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు అన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక గారికి వెంకటాపురం కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. కాలనీలో వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందించామన్నారు.మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని శ్రీమతి బుట్టా రేణుక గారు అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకొచ్చారు అని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయ న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాలు కొనసాగలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలన్నారు.*

 

*

ఈ ప్రచారంలో వార్డ్ నాయకులు మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, రామాంజి, రాజు, కొండ,జీవన్, శేఖర్, సోమేష్, వీరేష్, ఉదయ్, అయన్న, వెంకటేష్, ఎస్ బి రంగన్న, దేవేంద్ర, నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు, రుద్రాక్షలు బజారి, వడ్డే వీరేష్, షేక్ చాందు, బి ఎన్ నాగరాజ్, మాధవస్వామి, డిష్ రఫీ, ప్రభాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు