పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం..

న్యూస్ నైన్ టీవీ YGR

 

23.04.2024 తేదీన 32 వ వార్డ్ లో లక్ష్మీపేట మాల కొండయ్య హాస్పిటల్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, కోడలు బుట్టా సాహితి గారు వార్డ్ కౌన్సిలర్ యు.పద్మ (కోటకొండ నరసింహులు)పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్వీరదించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు విన్నవించారు. వ్యాపారులు, వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే అందేవని, ఇప్పుడు జగనన్న పాల నలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు.

 

ఈ ప్రచారంలో 32 వ వార్డ్ నాయకులు యు వీరేష్ యు. విజయ్ కుమార్, యు. నరసింహులు,భక్తార్,అల్వాల భాష,యు. రమేష్ బి. లక్ష్మీనారాయణ, వీరేష్, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.