Headlines

వైజాగ్ కు..ఇక రియల్ ఎస్టేట్ జోరు…!!

న్యూస్ 9:-వైజాగ్ ) కొన్ని ఏళ్లు గా వైజాగ్ రియల్ ఎస్టేట్ కు గడ్డు కాలం వచ్చేంది అనే చెప్పాలి.. ఇన్వెస్టర్..ఇన్వెస్ట్మెంట్ చెయ్యడానికి బయపడి,ఇతర రాష్టాల్లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపే వారు. ఇప్పుడు నుండి అలా ఉండదు ఎందుకు అంటే.. మన దేశం లోని కొన్ని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు దేశం మొత్తం సర్వే చేసాయి.. అందులో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో మన వైజాగ్ 17 స్థానం దక్కింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు. వల్ల.కొత్త కంపెనీలు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.. దానికితోడు విశాఖపట్నం లో అన్ని వనరులు కల్గి ఉన్నాయి. అందులో ముఖ్యంగా రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, కల్గివుంది. అంతేకాకుండా ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న..ఐ టీ కంపెనీ లకు రాష్ట్ర ప్రభుత్వం చే యూత నిస్తుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితి లో వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది అని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. అప్పటిలో కొన్ని ప్రభుత్వాలు పిలుపు మేరకు, అచ్చుతాపురం, గాజువాక, పెందుర్తి, కొత్తవలస, మధురవాడ, తగరపువలస, భోగాపురం, వంటి ఏరియాలో చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.