త్వరలోనే సూళ్లూరుపేట నాయుడుపేట పట్టణాలకు త్రాగునీరు అందిస్తాం..

  • త్వరలోనే సూళ్లూరుపేట నాయుడుపేట పట్టణాలకు త్రాగునీరు అందిస్థాం.
  •  సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం
  • మేము దౌర్జన్యాలకు దురహంకారకాలకు పాల్పడం
  • మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మంగళవారం న్యూస్ 9 స్థానిక సులూరుపేటలో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ ఇంటి వద్ద సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా సులూరుపేట మరియు నాయుడుపేట పట్టణాలకు త్రాగునీటి కొరత ఉందని త్వరలోనే త్రాగునీటి కొరతను తీర్చడం జరుగుతుందని ఆయన తెలియజేశారు అలాగే ప్రస్తుతం మంగళంపాడు నుండి సూళ్లూరుపేట పట్టణానికి త్రాగు నీళ్లు పైపులైను ద్వారా సరఫరా చేసేటటువంటి పథకం గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని త్వరలోనే ఆ పథకాన్ని పూర్తిచేసి సూళ్లూరుపేటకు సమృద్ధిగా తాగునీరు అందిస్తామని తెలియజేశారు ఆయన ఉపన్యాసం ప్రారంభించిన మొదటి లోనే మాకు ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు మేము జరపమని అలాగే మా పార్టీ యొక్క కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా ఒప్పుకోనేది లేదని ఆయన తెలియజేశారు. అలాగే సులూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అదేవిధంగా ఒకేసారి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సుమారుగా గత 42 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండగా అందులో ఇరవై సంత్సరాలు పార్టీ అధికారం లో ఉంది ఇప్పటి వరకు సూళ్లూరుపేట పట్టణంలో గాని నియోజకవర్గంలో కానీ ఒక పార్టీ కార్యాలయం లేదని త్వరలోనే మున్సిపాలిటీ వారితో రెవిన్యూ వారితో మాట్లాడి రెండు ఎకరంల స్థలము ఏర్పాటు చేసి అందులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు అంతేకాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు సులూరుపేట నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏకతాటిపై నడవడం జరుగుతుందని అంతేకాకుండా సులూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ నిర్మించబడి ఉన్నటువంటి సుమారు ఆరు వేల టిడ్కో ఇళ్లను త్వరలోనే వాటి యొక్క లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో సులూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి బొమ్మన పలని బొమ్మణ శ్రీధర్ మేడా సాయి ఎ జి కిషోర్ నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగినది.