యాడికిమండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి వద్ద ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరం కి భారీ స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు..

న్యూస్.9)

యాడికిమండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి వద్ద ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరం కి భారీ స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. అక్టోబర్ 1 జాతీయ రక్తదాతల దినోత్సవం, యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 88 యూనిట్ల రక్తాన్ని సేకరించామని భారీ ఎత్తున స్పందన లభించినందుకు రక్త దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని యాడికి మే ఐ హెల్ప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమంలో సేకరించిన రక్తాన్ని 30% యూనిట్ లని అనంతపురం గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుకు అందజేయబడుతుందని సేవ బ్లడ్ సెంటర్ తాడిపత్రి పేరి అశోక్ కుమార్ తెలియజేశారు.ఈ రక్తదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం గా 5000 రూపాయలను నేతిబొట్టు కుళ్ళాయమ్మ జ్ఞాపకార్ధంగా ఆమె బంధువులు మైసూరు కుళ్లాయప్ప, మైసూరు మురళి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది.ఈ రక్తదాన కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ పెనుగొండ శివకుమార్, టెక్నికల్ సూపర్వైజర్ పేరి విజయ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ పవన్ కుమార్, పేరి అశోక్ కుమార్, సుమిత్ర,స్వప్న, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి , పెద్దవడుగూరు పర్లపాటి మహేంద్ర, గుత్తి కాయపాటి నరేష్ యాదవ్, యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ, చందగాని దృవ నారాయణ, బడిగించల వేణు, సాయివరపు నాగరాజు, చింతా నరసింహ, సిద్ధపటం తిరుమలరెడ్డి,మెటికల చెన్నయ్య, సాకరే శంకరప్ప, గాంధీజీ స్కూల్ రామ మోహన్, కావలి సుధాకర్ (వెంకటాంపల్లి) వేడుకాపుర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.