వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వైనాట్ 175 నినాదాన్ని నిజం చేయాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ ఆవుతున్నారు. వైసీపీ పార్టీ నేతలతో సమావేశమై.. కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు కూడా వచ్చారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు కీలక ఆదేశాలిచ్చారు జగన్. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలని చెప్పారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని స్పష్టం చేశారు. అంటే.. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని చెప్పారు. రీజనర్ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలనే దానిపై ప్రణాళికను వివరించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ కోసం పిలిచినట్టుగా జగన్ స్పష్టం చేశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ వెళ్తున్నారని జగన్ అన్నారు. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారన్నారు.
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలని జగన్ చెప్పారు. ఇందుకోసం 10 నుంచి 15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందుకోసం 50 కుటంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు జగన్. అయితే ప్రతీ 50 ఇళ్ల ఒక పురుషుడు, మహిళ గృహసారథులుగా ఉంటారని చెప్పారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు చూస్తారన్నారు. అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారు. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపికచేయాలి. ’50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారు. సుమారు 15 వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్లు ఎంపికను చేయాలి. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు వీరిని నియమిస్తారు. ఎంపిక అయిపోయాక.. సచివాలయ పరిధిలో పార్టీకి సంబంధించిన కన్వీనర్లు డోర్ టూ డోర్ వెళ్లి పార్టీ నుంచి సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్ అందిస్తారు. 15 రోజుల్లో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు.’ అని జగన్ అన్నారు. ఇలా మెుదటిసారి తిరగడం కారణంగా సచివాలయ పరిధిలో ఓ అవగాహ వస్తుందని సీఎం జగన్ అన్నారు. ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే ఉంటారని, ఇంకోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ వెళ్తారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలోత బూత్ కమిటీ నుంచి బలమైన నెట్ వర్క్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. నెట్ వర్క్ గట్టిగా ఉంటే.. గెలవడం ఈజీగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 గెలవడం లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు.