వక్రబుద్ధి చాటుకున్న చైనా.. ఉగ్రవాదికి మద్దతుగా డ్రాగన్ కంట్రీ..

క్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఎం) అధినేత, ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలన్న భారత్ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

1974లో పాకిస్థాన్‌లో జన్మించిన జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్, 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఐసీ814 హైజాక్, 2001లో పార్లమెంట్‌పై దాడి, దాడులతో సహా భారత్‌లో అనేక ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసి అమలు చేయడంలో పాలుపంచుకున్నాడు. 2016లో పఠాన్‌కోట్‌లోని IAF స్థావరంపై దాడి కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు.

UN భద్రతా మండలి 1267 ISIL అల్ ఖైదా ఆంక్షల జాబితాలో అబ్దుల్ రవూఫ్‌ను చేర్చాలని భారతదేశం చేసిన ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పాక్‌ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకొన్న చరిత్ర చైనాకు ఉంది.గత ఏడాది ఆగస్టులో, UN భద్రతా మండలిలో శాశ్వత, వీటో-విల్డింగ్ సభ్యుడైన చైనా, రవూఫ్ అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి, ఆస్తుల స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధం, అతనిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొనాలన్న భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనపై తోసిపుచ్చింది.

పాక్‌కు చెందిన హఫీజ్‌ తలాహ్‌ సయీద్‌, షాహిద్‌ మహమ్మద్‌, సాజిద్‌ మిర్‌లపై ఐరాస ఆంక్షలు విధించకుండా కాపాడింది. 2022 జూన్‌లో పాక్‌కు చెందిన లష్కరే ఉగ్రసంస్థకు చెందిన అబ్దుల్‌ రహ్మాన్‌ మక్కీపై ఆంక్షల ప్రతిపాదనను అడ్డుకుంది చైనా. గత ఏడాది జూన్‌లో 1267 ఆంక్షల కమిటీ కింద పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌గా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని చేర్చాలని భారత్, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.

భారత్‌, అమెరికా తీవ్రంగా ప్రయత్నించడంతో ఐరాస ఈ ఏడాది జనవరిలో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇరు దేశాల ఒత్తిడికి చైనా తలొగ్గాల్సి వచ్చింది. డిసెంబర్ 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్: ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్’పై కౌన్సిల్ బ్రీఫింగ్‌లో చేసిన వ్యాఖ్యలలో పాకిస్తాన్, చైనాలను “ఉగ్రవాదానికి సమకాలీన కేంద్రం” అని అన్నారు.