కొద్ది రోజులుగా రాజస్థాన్ రాష్ట్రాన్ని కుదిపివేసిన అకాల వర్షాలు, ఉరుములు శాంతించాయి. అంతలోనే రాష్ట్రంలో మరో ప్రకృతి విపత్తు మొదలైంది.
ఇప్పటికే మండ ఎండలకు ఉడికిపోతున్న రాజస్థానీలను తాజాగా ఇసుక తుఫాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని బార్మర్ నగరంలో కనిపించిన ఇసుక తుఫాను వీడియో చూస్తే గూస్‌బంప్‌లు రాకుండా ఉండవు. ఇళ్లను ధ్వంసం చేస్తుందా అన్నట్లుగా అంతెత్తున దూసుకువచ్చింది. ఆకాశాన్ని తాకినట్లున్న ఇసుక తుఫానును బహుశా మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.
Masab Tank Flyover : వాహనం నుంచి కిందపడిన ఆయిల్ డ్రమ్ములు.. రోడ్డు మొత్తం ఆయిల్.. భారీగా ట్రాఫిక్ జామ్
దాదాపు 70 నుంచి 80 అడుగుల ఎత్తులో ఇసుకతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ ఇసుక సుడిగాలి క్రమంగా పెద్దదవుతూ వచ్చింది. ఆ తర్వాత ఈదురు గాలులు వీయడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఇసుక వ్యాపించింది. ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉందో వీడియోలో చూడవచ్చు. ఆకాశాన్నంతా తన గుప్పిట్లోకి తీసుకున్నట్టు ముంచుకొచ్చింది. తుఫాను కారణంగా ఆకాశం బూడిద రంగులోకి మారి, సూర్యకాంతి మసకబారింది. భయంకర రీతిలో మరింత ముందుకు దూసుకుపోతుందని స్థానికులు చెబుతున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జైసల్మేర్ నుంచి తలెత్తిన ఈ ఇసుక తుపానును పలువురు తమ కెమెరాల్లో బంధించి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.