Headlines

త్వరలో 14 వ విడత పీఎం మోడీ కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్..

ప్రధాని మంత్రి కిసాన్ యోజన 14వ విడత డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లలో పడే అవకాశం ఉంది. ఈ సారి 3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కడం లేదు.

దీనికి ప్రధాన కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే అని తెలుస్తోంది.. అయితే వీలైనంత త్వరగా EKYC పూర్తి చేయాలని.. లేకపోతే రూ.2వేలు ఖాతాలో పడవని రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్

అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేందుకు ఇంకా సమయం ఉంది. మీరు మీ eKYCని స్వయంగానూ లేదా మీ సేవా సెంటర్ కు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును ప్రభుత్వం సంవత్సరానికి మూడుసార్లు బదిలీ చేస్తుంది. దీని కాల వ్యవధి కూడా నిర్ణయించబడింది. ఏప్రిల్ 1 మరియు జూలై 31 మధ్య మొదటి విడతగా డబ్బును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయనుంది. రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య.. మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య జమ చేయబడతాయి.