పగ- పాలన, పగ సాధనతోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు..
సంపద సృష్టిస్తేనే భవిష్యత్తుకు గ్యారెంటీ
*సంపద సృష్టించడం చంద్రబాబుకే సాధ్యం..*.
*అప్పులతో ఎల్లకాలం పథకాలను కొనసాగించలేరు.*.
బండారు సత్యానందరావు
రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు
అభివృద్ధి, ఆదాయం సంపద సృష్టించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలరని, తద్వారా భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.
కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో పార్టీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగింది..
సమావేశంలో భవిష్యత్తు గ్యారెంటీ, మహానాడు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి విస్తృత చర్చ జరిగింది..
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ
పేదవాడి వెన్నంటి నిలిచే పధకాలివి!
తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆశయం జన సంక్షేమం. ఈ కారణంగానే వృద్దులకు పింఛన్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాలు అమలు చేసి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ ఒరవడిని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇటీవలే రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడులో “పూర్ టు రిచ్”లో భాగంగా ఆరు సంక్షేమ పథకాలను ప్రకటించిందన్నారు.
సంపద పెంచడం ఎలాగో తెలిసిన వారికే సంక్షేమం విలువ, అమలు తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ‘విజన్2020’ తో సంపదసృష్టికి బీజం వేశారు చంద్రబాబు నాయుడు. అదే స్ఫూర్తితో నేడు ‘విజన్ 2047’ రూపొందించారు.”పూర్ టు రిచ్”పథకం ద్వారా మన రాష్ట్రంలో సంపదను సృష్టించి దానిని పేదలకు పంపిణీ చేయాలనేదే చంద్రబాబు విజన్. సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని సత్యానందరావు అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయి. జాబ్ క్యాలండర్ అని చెప్పి సాక్షి క్యాలండర్ ఇచ్చారు. వారంలో సీపీఎస్ రద్దని జిపిఎస్ తీసుకువచ్చారు.. జీతాలు, పెన్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిజస్వరూపం బట్టబయలైంది. ఇంకా ప్రజలు అమాయకులనే ధీమాతో తాను ఏమి చెప్పినా నమ్ముతారనుకుంటున్నారు.అందులో భాగంగానే పేదలు-పెత్తందారులంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. భారత దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిని తానేనన్న విషయం మర్చిపోయారు. ఏదిఏమైనా పగ-పాలన, పగ-సాధనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమాల బాట పట్టాలంటే “తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరమన్నది ప్రజలు గర్తించారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం తద్యమన్నారు.
భవిష్యత్తుకు గ్యారంటీ, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని సత్యానందరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు..
సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ముఖ్యనాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.