అభివృద్ధి పథంలో కొత్తపేట నియోజకవర్గం
ప్రతీ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు
—–ప్రభుత్వ విప్ చిర్ల
ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు బలంగా పడుతున్నాయని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏదైనా సమస్య వస్తే మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామంలోనే సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పాలనను ప్రజల ముంగిళ్ళలోకి తెచ్చారని అన్నారు.
నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రోడ్లు నిర్మించుకున్నామని
దేవరపల్లి గ్రామంలో చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోని ఈతకోట నుండి కొత్తపేట వెళ్ళే ప్రధాన రహదారిని నిర్మించుకున్నామని, దేవరపల్లి-మట్లదొడ్డి రహదారిని, మడికి గ్రామంలో రహదారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అని అతి త్వరలోనే నిర్మించడం జరుగుతుంది అని అన్నారు.
అనంతరం గ్రామంలో 35 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం-1 భవనం,
మెరుగైన ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో 21 లక్షల రూపాయలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం 5 లక్షల 20 వేల రూపాయలతో దేవరపల్లి కోసూరి నగర్ రహదారిలోని స్మశానవాటిక నందు చేసిన అభివృద్ధి పనులను చిర్ల ప్రారంభించారు.