ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ.

కొత్తపేట మండలం వానపల్లి:- సత్యమాంబ నగర్ లో మస్కపల్లి త్రిమూర్తులు అధ్వర్యంలో అగ్నికుల క్షత్రియులు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కాలువ గట్టునా అనుకుని ఉన్న పిష్ మార్ట్ ను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించడంపై *రాష్ట్ర మత్యకార సంక్షేమ సమితి కార్యదర్శి మస్కపల్లి త్రిమూర్తులు మాట్లాడుతూ…* స్థానిక శాసన సభ్యుల సహకారంతో పిష్ మార్ట్ కి సంబంధించి రుణాలు మంజూరు చేసి. వారే అక్కడ నిర్మించాలని సూచించి మరలా అధికారపార్టీ నాయకుల అండదండలతో వారే ద్వసం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మా సామాజికవర్గం పట్ల స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తమా వైఖరి మార్చుకోకపోతే త్వరలో కొత్తపేట నియోజకవర్గం అగ్నికుల క్షత్రియుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అగ్నికుల క్షత్రియుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.