మెర్లపాలెంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

మెర్లపాలెంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును వివరించి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో 2 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం నిర్వహించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజల వద్ద నుండి ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మెర్లపాలెం గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు లబ్ది చేకూరింది అని గ్రామంలో
బీసీ లబ్ధిదారులకు 3 కోట్ల 61 లక్షల 82 వేల 788 రూపాయలు,
ఎస్సి లబ్ధిదారులకు 2 కోట్ల 37 లక్షల 56 వేల 708 రూపాయలు,
ఎస్టీ లబ్ధిదారులకు 14 లక్షల 57 వేల 780 రూపాయలు,
మైనారిటీ లబ్ధిదారులకు 4లక్షల 77 వేల 308 రూపాయలు,
కాపు లబ్ధిదారులకు 5 కోట్ల 27 లక్షల 72 వేల 880 రూపాయలు,
ఇతర లబ్ధిదారులకు 2 కోట్ల 59 లక్షల 83 వేల 796 లబ్ధిదారులకు కలిపి మొత్తం గ్రామంలో గడిచిన 4 సంవత్సరాల కాలంలో 14 కోట్ల 6 లక్షల 31 వేల 260 రూపాయలు లబ్ధిచేకూర్చడం జరిగింది అని తెలియచేశారు.

గ్రామంలో ఇవి కాక గ్రామ సచివాలయ భవనం, ఆర్బికే సెంటర్, వెల్నెస్ సెంటర్ నిర్మాణం చేయడం జరుగుతుంది అని, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు సమూలంగా మర్చివేయడం జరిగింది అని, జగనన్న గోరుముద్ద, విద్యకానుక తదితర పథకాల ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జరిగింది అని అన్నారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే ప్రయాణం చేస్తున్నామని, సాధ్యమైనంత మంచి చేసి చూపిస్తున్నామని తెలియచేశారు.

గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ మరియు పాఠశాలలను సందర్శించి అక్కడ బాల బాలికలకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు.

అనంతరం గ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సత్యనారాయణరెడ్డిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు.