Headlines

సమరయోధుడు…బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న..

 

శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్
రెడ్డి సుబ్రహ్మణ్యం

కొత్తపేట //
బలహీనవర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న …దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ ఎస్ బి సి కన్వెన్షన్ ప్రాంగణమునందు గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలు వేసి రెడ్డి సుబ్రహ్మణ్యంనివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలుస్తారు ..అటువంటివారు మన మధ్య భౌతికంగా లేకపోయినా మన హృదయాలలో నిలిచిన వ్యక్తులుగా వారి విగ్రహాలు పెట్టుకుని వారిని స్మరిస్తూ ఉంటాం.అటువంటి వారిలో అగ్ర గన్యులలో సర్దార్ గౌతు లచ్చన్న ఒకరుగా నిలుస్తారని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు..స్వాతంత్య్ర సమరయోధుడిగా,
జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా
రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా
,రాజకీయ నాయకుడిగా
గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టిందని సుబ్రహ్మణ్యం తెలియజేసారు..శెట్టిబలిజ ,గౌడ శ్రీశయన, యాత, ఈడిగా గీత కులవృత్తి చేసే ఐదు ఉప కులాలు సమాజంలో ఐక్యతగా ఉండాలని సమావేశాలు నిర్వహించి ఐక్యత కోసం పాటుపడిన మహనీయులు సర్దార్ గౌతులచ్చనని సుబ్రహ్మణ్యం అన్నారు. మండల శెట్టి బలిజ సంఘం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడలి పెరుమాళ్ల, కముజు వెంకటేశ్వరరావు గుబ్బల మూర్తి ,గుబ్బల సత్తిపండు , వాసంశెట్టి లక్ష్మణరావు, వాసంశెట్టి సత్యనారాయణ( దత్తుడు) , వాసంశెట్టి సత్యనారాయణ. కుడుపూడి సత్యనారాయణ, జక్కంశెట్టి ఓం ప్రకాష్, కముజు గంగాధరం, కముజు తాతాజీ, బొక్క తిరపయ్య, కముజు గోపి, శీలం శ్రీను,అప్పారి శ్రీను,శీలం కొండబాబు,రాయుడు బాబి, బొక్కా తమ్మరాజు, విక్రమ్, మట్టపర్హి ప్రసాద్, జోగి మురళి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు