Headlines

ఈతకోటలో గ్రామ సభ నిర్వహణ.

  • ఈతకోటలో గ్రామ సభ నిర్వహణ.
  • ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
  • సర్పంచ్. కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేసిన
  • బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామ పంచాయతీలో బుధవారం నాడు గ్రామ సభను నిర్వహించారు సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్ష్మి అధ్యక్షతనతో జరిగిన గ్రామ సభ సమావేశంలో గ్రామ అభివృద్ధి కోసం పలు అంశాలపై సమస్యలపై చర్చించారు అనంతరం సభలో పాల్గొన్న బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు గ్రామంలోని అనేక సమస్యలపై గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్ష్మి పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అన్వర్ కి వినతిపత్రాన్ని అందజేసి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామ సభలో ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు మాట్లాడుతూ పలు చోట్ల పైపులు లేకపోవడం పాడైపోవడంతో త్రాగునీరు కోసం మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని చేతి పంపులను ఏర్పాట్లు చేసి అద్వాన్నంగా మారిన డ్రైనేజీల నిర్మాణం కోసం కృషి చేయాలని వారిని కోరారు సర్పంచ్ సుబ్బలక్ష్మి. కార్యదర్శి అన్వర్ మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని సమస్యల పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు పలు అంశాలపై తీర్మానాన్ని చేశామని వాటిని రూపకల్పనచేసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు కలిసిగట్టుగా గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కూడా సహకారాన్ని అందించాలన్నారు
ఈ కార్యక్రమంలో. ఉప సర్పంచ్ ఏనుగపల్లి నాగార్జున, ఎంపీటీసీ బొరుసు సీతారత్నం,పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ .బి. వి.వి. ఎస్ ఎన్ మూర్తి.
వార్డు సభ్యులు మోటూరి సుబ్బలక్ష్మి, కోయిల వెంకటకృష్ణ,గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి),ఎంపీపీ స్కూల్ చైర్మన్ మట్టా సత్తిబాబు,బొరుసు సుబ్రహ్మణ్యం, కొండేటి సత్యనారాయణ,కొప్పినీడి రామకృష్ణ,
రేలంగి వెంకటస్వామి,యర్రంశెట్టి సత్యనారాయణ,నాగిరెడ్డి దుర్గారావు,గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు. వాలంటిరీలు.ఎ.ఎన్ ఎంలు.అంగన్ వాడి .పంచాయతీ సిబ్బంది. మహిళలు పోలీసులు.ఆశా వర్కర్స్.గ్రామ రెవిన్యూ అధికారులు. హౌసింగ్. ఉపాధిహామీ సిబ్బంది.
తదితరులు పాల్గొన్నారు