Headlines

సమంత, నాగ చైతన్యలపై శోభిత ధూళిపాళ్ళ సంచలన వ్యాఖ్యలు!!

శోభిత ధూళిపాళ్ళ.. నాగచైతన్య సమంతల విడాకుల తర్వాత సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేరు శోభిత ధూళిపాళ్ళ. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

శోభిత కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇక ఇదే సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా అప్పట్లో వైరల్ అయింది.

ఇక శోభిత దూళిపాళ్ల పై వచ్చిన రూమర్స్ ను నాగచైతన్య ఖండించారు. శోభిత కూడా తనదైన శైలిలో అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. తాజాగా మరోమారు ఓ ఇంటర్వ్యూలో ఆమె నాగచైతన్య, సమంత ల పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ సీజన్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శోభిత ధూళిపాళ్ళ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య ల గురించి మాట్లాడింది.

ఈ మధ్య కాలంలో ఎప్పుడు శోభిత ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా నాగచైతన్య గురించి ఆమెను ప్రశ్నిస్తున్నారు. మీడియా ప్రశ్నలకు తనదైన సమాధానం చెబుతున్న శోభిత, తాజాగా ఇద్దరి గురించి ప్రచారం అవుతున్న రూమర్స్ పై కాకుండా నాగచైతన్య, సమంత ల వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శోభిత మాట్లాడుతూ సమంత సినిమా కెరీర్ చాలా బాగుంటుందని, సమంత సినిమాలు చూస్తే అన్ని గొప్ప సినిమాలే కనిపిస్తాయని చెప్పారు. ఆమె చాలా అద్భుతమైన సెలక్షన్ చేసుకుంటుందని వెల్లడించారు. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ ఆమె సెలక్షన్స్ లో బెస్ట్ ఛాయిస్ అంటూ శోభితా ధూళిపాళ్ళ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమె ప్రతిదీ గొప్పగా ఉండే ప్రాజెక్టుని ఎంచుకుంటున్నారని, ఆమె సినీ కెరీర్ బాగా సాగుతుందన్నారు.

ఇక ఇదే సమయంలో నాగచైతన్యపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగచైతన్య అందరితో మంచిగా కలిసి పోతాడని పేర్కొన్నారు. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించే వ్యక్తి నాగచైతన్య అని తెలిపారు. నాగచైతన్య చాలా హుందాగా, గౌరవంగా, కూల్ గా ఉంటాడని, చాలా మంచివాడు అని కితాబు ఇచ్చారు శోభిత ధూళిపాళ్ళ. ప్రస్తుతం ఆమె వీరిద్దరి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.