Headlines

కమిషన్ లు, పర్సంటేజ్ లు కోసం కక్కుర్తి పడేది ఎవరు…

కమిషన్ లు, పర్సంటేజ్ లు కోసం కక్కుర్తి పడేది ఎవరు…
కొత్తపేటలో ఎవరిని అడిగినా చెప్తారు.. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ అడిగిందానికి సమాధానం చెప్పలేక సందర్భం లేని మాటలు మాట్లాడుతున్నారు..

కొత్తపేట కౌషిక్ రోడ్ కి 2014 లో శంకుస్థాపన చేసి ఆధునికరించి రోడ్డు నిర్మాణం జరపలేదా… ఆ రోడ్డుపైనే మీరు నెలల తరబడి సమయం వెచ్చించి సిమెంట్ రోడ్ నిర్మించారు.. బెర్మలు పూర్తి చేయకుండా బిల్లులు చేసుకుంటున్నారు…
రావులపాలెం నుండి పలివెల వరకు 9 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు రూ.8.42 కోట్లు నిధులు మంజూరయ్యాయి… రెండేళ్ల పాటు వాహనదారులను, పాదచారులను నానా ఇబ్బందులకు గురిచేసి, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు నిర్మాణం చేశారు.. రోడ్డు నిధుల్లో సగానికి సగం బుక్కేసారు… అదనంగా బంగారమ్మ గుడి దగ్గర నుండి కాపు కళ్యాణ మండపం వరకు కోటి ఇరవై లక్షల రూపాయలతో ఇరువైపులా డ్రైన్ పేరిట నిధులు డ్రా చేసుకున్నారు

బడుగువాని లంక బ్రిడ్జి నిర్మాణం మమ్మూటికీ సత్యానందరావు గారి కృషి ఫలితమే.
పదవి ఇస్తే ఒకలా, పదవి ఇవ్వకపోతే ఒకలా మాట్లాడే మీరా నీతులు వల్లించేది..
*జగ్గిరెడ్డి అభివృద్ధి అంటే ఏంటో 4 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నారు.