డిసెంబర్ 17 నుండి అంబేద్కర్ తృతీయ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

  • డిసెంబర్ 17 నుండి అంబేద్కర్ తృతీయ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
  • డ్రా 16వ తారీకు మధ్యాహ్నం 2 గంటలకి కాలేజ్ గ్రౌండ్ లో
  •  టోర్నీ నిర్వాహకులు గొల్లపల్లి నరేష్ కుమార్, నాగరాజు, సురేష్, మహేష్, దుర్గాప్రసాద్ తెలియజేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అంబేద్కర్ నగర్ లో ఈ నెల 17 నుండి అశ్వాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మండలస్థాయి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తృతీయ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టోర్నీ నిర్వహకులు గొల్లపల్లి నరేష్ కుమార్, మురికిపూడి నాగరాజు, ఆంలోత్ సురేష్, కొమ్ము మహేష్, పేరాల దుర్గాప్రసాద్ తెలిపారు. 16వ తారీఖు మధ్యాహ్నంలోగా ఎంట్రీలు నమోదు చేసుకోవాలని క్రీడాకారులకు తెలియజేశారు, మ్యాచ్లు టెన్నిస్బల్తో నిర్వహిస్తామని, ఎంట్రీ ఫీజు 1000రూపాయలు చెల్లించాలని తెలిపారు. ప్రధమ బహుమతి 16వేల రూపాయలు ఉమ్మడి ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ద్వితీయ బహుమతి 12వేల రూపాయలు అశ్వాపురం సర్పంచ్ బానోత్ శారద మరియు గొందిగూడెం సర్పంచ్ పాయం భద్రమ్మ, షీల్డ్లు దాన ధర్మ ట్రస్ట్ నిర్వాహకురాలు గంటా రాధ స్పాన్సర్ చేస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9110501150, 7780366151, 8106454541, 9906519308 0 సంప్రదించాలని తెలిపారు.