Headlines

విజృంభిస్తున్న కోవిడ్..కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు..

బూర్గంపాడు డిసెంబర్ 22

( న్యూస్ 9)

 

ఐ డి ఓ సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై వైద్య శాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు.జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు.

కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయమని చెప్పారు.

ప్రభుత్వం ప్రవేట్ ఆసుపత్రిలో కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ నియంత్రణ డ్రగ్స్. ఆక్సిజన్ వెంటిలేటర్స్. పి పి ఈ కిట్లు మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు .ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి శిరీష మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.