Headlines

క్రమశిక్షణతో కూడిన జీవితానికి భవిష్యత్తును తీర్చిదిద్దుకనేందుకు పొదుపే ఏకైక మార్గమని విధాతా పురుషుల పొదుపు సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ అన్నారు..

క్రమశిక్షణతో కూడిన జీవితానికి భవిష్యత్తును తీర్చిదిద్దుకనేందుకు పొదుపే ఏకైక మార్గమని విధాతా పురుషుల పొదుపు సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ అన్నారు కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శుక్రవారం నాడు పొదుపు సంఘం సమావేశం అధ్యక్షులు ఊడెం తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రజాబాహుళ్యంలో పొదుపును నిత్యజీవన విధానంగా చేయాలనే లక్ష్యంతో విధాతా పురుషుల పొదుపు సంఘం స్థాపించామన్నారు.సభ్యుల ఆర్థిక అవసరాలకోసం ప్రభుత్వంపైనో బ్యాంకులపైనో ఆధారపడకుండా పరస్పరం సహకరించకోవాలనే లక్ష్యంతో సంఘం పురోగమిస్తోంది న్నారు దురదృష్టవశాత్తు సభ్యులు మరణిస్తే ఋణభారం కుటుంబ సభ్యులపై పడకుండా చూసేందుకు అభయనిధి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.‌సభ్యులు పిండి అంజయ్య మరణించగా ఆయన భార్య బుచ్చమ్మ కు,నాగరాజు మరణించగా ఆయన తల్లికి,దబ్బెట ఎల్లయ్య మరణించగా ఆయన భార్యకు అభయనిధి నుండి ఆర్థిక సాయం అందజేశారు కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మర్యాల రవీందర్ పర్యవేక్షకుడు టి.మల్లేశం పాలకవర్గ సభ్యులు సంజీవరెడ్డి ఈశ్వర్ గఫూర్,కనకయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు