Headlines

రానున్న సార్వత్రిక ఎన్నికలను పూర్తి అవగాహనతో అధికారులు పగడ్బందీగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 9 :

రానున్న సార్వత్రిక ఎన్నికలను పూర్తి అవగాహనతో పగడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రీ సర్వే, సమీత్వ, గ్రహనిర్మాణాల రిజిస్ట్రేషన్, వైద్య ఆరోగ్యశాఖ, ఎలక్షన్స్ తదితర అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల తహసిల్దార్లు, ఎంపీడీవోలు అందరూ బదిలీలపై నూతనంగా విధులకు హాజరయ్యారని, మీరంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి సమర్థవంతంగా పనులు నిర్వహించాలని ఆమె అన్నారు. తమ ముందు అధికారులు నిర్వహించిన పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండి, తర్వాత చేయవలసిన విధివిధానాలపై పూర్తి అవగాహన పొందాలన్నారు. అప్పుడే సమర్థవంతంగా తమ విధులను నిర్వహించగలరనీ ఆమె అన్నారు. మండలాధికారులు కచ్చితంగా తమ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలన్నారు. రీసర్వే కు సంబంధించి ఫైనల్ ఆర్ ఓ ఆర్ పూర్తి చేయడం జరిగిందని, కరెక్షన్ మాడ్యూల్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోస్ అప్డేషన్ లో పలు గ్రామాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. స్వమిత్వ కు సంబంధించి 9(2) నోటీసులు జారీ చేయడం లో ఉన్న పెండింగ్ లను కూడా పూర్తి చేయాలన్నారు. స్టోన్ ప్లాంటేషన్ పనులు కూడా వేగవంతంగా నిర్వహించాలన్నారు. గృహ నిర్మాణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని, వీటిలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియను సంబంధిత ఆర్డీవోలు తరచూ మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించాలని ఆమె ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవో లదే అని, సచివాలయాల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పనులు లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా సిబ్బందితో నిర్వహణ జరిపేలా పూర్తి చర్యలు తీసుకోవాలని, ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులకు తావివ్వకూడదని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పనులు వేగవంతంగా చేయాలని ఆమె ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర, సురక్ష కార్యక్రమం సంబంధించి వ్యయం వివరాలను అప్లోడ్ చేస్తేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయని వెంటనే సంబంధిత అధికారులు బిల్లులను అప్లోడ్ చేయాలని ఆమె అన్నారు. ఎలక్షన్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా స్వీప్ ఆక్టివిటీస్ నిర్వహించాలని ఆమె అన్నారు. సంబంధిత మండల ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించి యువ వాటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు రూట్ మ్యాప్ ను, సంబంధిత బిఎల్వోస్ వివరాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆమె అన్నారు. పూర్తి అవగాహన తో సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆదేశించారు. మండల అధికారులు ఎలక్షన్ సంబంధించిన ట్రైనింగ్ జరిగేటప్పుడు కచ్చితంగా శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. మండలాధికారులు తమ మండల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ ను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. రానున్న వేసవికాలం దృశ్య జిల్లాలో ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆమె అన్నారు. సంబంధిత మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీవోలు కె.శ్రీనివాసులు రాజు, యం.అచ్యుత అంబరీష్, కె.చెన్నయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు, గృహా నిర్మాణ శాఖ పిడి కానాల సంగీత్ మాధుర్, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్ అప్పారావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, డియల్డివో ఏవి అప్పారావు, తహాశీల్దార్లు, యంపిడివోలు, ఈవోపీఆర్డీలు, డిప్యూటీ తహాశీల్దార్లు, మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.