బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం…జనసేన సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 9:

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు . ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి. ఇరువురికి 40 వేలు ఆర్థిక సాయం అందజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం విప్పర్రు గ్రామానికి చెందిన..బలిజ రాముకి ఇద్దరు కుమార్తెలు గంగభవాని(25),రమాదేవి(22)లకు ఇటీవల తాడేపల్లిగూడెం కొత్త బ్రిడ్జి మీద లారీ గుద్దడం తో భయంకరమైన ప్రమాదం జరిగిన విషయం తెలిసుకొని

ఆ ఆడబిడ్డల తండ్రి సామాన్య ఆటో డ్రైవర్ అవడం తో,పేదరికం తో ఇబ్బంది పడటం తెలియడంతో విప్పర్రు గ్రామ జనసేన ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 40 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విప్పరు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.