Headlines

నల్లగొండ కేసీఆర్ గారి సభకు తరలిన కొండపాక మండల బిఆర్ఎస్ నాయకులు..

 

 

ఈరోజు నల్లగొండలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కెసిఆర్ గారి భారీ బహిరంగ సభకు కొండపాక మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.

 

ఈ సందర్భంగా బారాస మండల అధ్యక్షుడు *నూనె కుమార్ యాదవ్* మరియు రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ *రాగల దుర్గయ్య గారు* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా జలాలపై నీటి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పట్ల దాన్ని నిరసిస్తూ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ నీటి సంపదను, హక్కులను కాపాడుకోవడానికి మళ్లీ కేసిఆర్ ఉద్యమం చేపట్టారని

 

కృష్ణా జలాల నీటి హక్కులు తెలంగాణకే ఉండాలనే కెసిఆర్ గారు తలపెట్టిన భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నామన్నారు.

 

రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలంతా కూడా మన హక్కుల కోసం మనము ఆలోచన చేసి,

 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేసి గద్దె దించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

ఎన్ని రోజులకైనా, ఏ పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి శ్రీరామరక్ష అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బారాస తాజా మాజీ సర్పంచులు ముత్యాల కనకయ్య, పిడిశెట్టి శ్రీనివాస్, బారాస సీనియర్ నాయకులు పిల్లి నాగరాజు, గొట్ట ఐలయ్య, సున్నం భాస్కర్, ఏమల్ల రాజిరెడ్డి, యాటెల్లి మల్లయ్య, అర్జున పట్ల కనకయ్య, దొమ్మాట చంద్రశేఖర్, ముత్యంరావు, నీల వెంకటేశం, బందారం మాజీ ఉపసర్పంచ్ వెంకటేశం, గుర్రాల రామస్వామి, చిక్కుడు భాను, దబ్బేట ప్రభాకర్, దబ్బెట బాబు, గుర్రాల రాజు, కెమ్మసారం సంతోష్, సార్ల వెంకటేష్, గాదగోని రాకేష్ గౌడ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కెసిఆర్ గారి మీటింగ్కు నల్లగొండకు తరలి వెళ్లారు….