Headlines

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యం..

  • ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యం
  • – జగన్ అవకాశవాది
  • – చంద్రబాబు మాదిగలను విస్మరించాడు.
  • -బిజెపికి మద్దతు పలికిన మందకృష్ణ మాదిగ

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 23:

 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం స్థానిక గీతా ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహా సభ యార్లగడ్డ రత్నరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ లేకపోవడం వల్ల విద్య, రాజకీయ లాంటి పలు రంగాల్లో వెనుకబడిఉన్నారన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉధ్యయం కొనసాగుతూనే ఉందని రాజకీయ పార్టీలు మాదిగలను మోసంచేస్తూనే ఉన్నాయన్నారు. గతంలో వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అయన వారసుడుగా వచ్చిన జగన్ మాదిగలను రాజీయంగా ఉపయోగించుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేశారని వాపోయారు. మాదిగలను మోసం చేసిన జగన్ దేశంలోనే మడం తిప్పని అవకావవాదిగా చరిత్రలో నిలిచిపోయారని ఆరోపించారు. చంద్రబాబు మొదటిసారి మాదిగలకు రిజర్వేషన్ కల్పించి ఉద్యో, విద్య, రాజకీయరంగంలో అవకాశాలు కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో అవకాశవాదుల మాటలు విని తన వెంటే ఉన్న మాదిగలను విస్మరించారని అన్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న మాదిగలను వాడుకుని వదిలేసిన టిడిపి, వైసిపి పార్టీలను పక్కనపెట్టి బిజెపికి ఓటు వేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. వైసిపికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని అన్నారు. పరోక్షంగా జగన్ బిజెపికి పార్టీమెంటు, రాజ్య సభల ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారని తెలిపారు. వర్గీకరణ కీలకదశలో ఉందని దాన్ని సాధించేందుకు కేంద్రంలో ఉన్న బిజెపికి మాదిగలు మద్దతు పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శెట్టె ఝాన్సీరాణి, ఎంఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షలు చెప్పుల వాసు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి రాజశేఖర్, రాష్ట్ర నాయకురాలు చవటపల్లి విజయ, నియోజకవర్గ కన్వీనర్ దేవతల శివాజి, దూలపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.