ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల భాధ్యత….

  • ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల భాధ్యత…..
  • ఓటును పవిత్రంగా వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి మార్గ దర్శకం…..
  • జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గాంధీ…..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 23: శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు శ్రీవిజ్ఞానవేదిక, రెవెన్యూ శాఖ, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు హక్కు వినియోగ ప్రచార బ్రోచర్ ను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సమర్థవంతమైన నాయకత్వానికి ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వెయ్యాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యముగా స్వీప్ కార్యక్రమాలలో స్వచ్ఛంద సంస్థలు పాలు పంచుకుని మంచి సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఏటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గాంధీ పిలుపు నిచ్చారు.నెలరోజుల నుంచి భీమవరం పట్టణ, గ్రామీణ పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు తదితర ప్రదేశాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనరు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట రాజులు జిల్లా కలెక్టరు కు వివరించారు.