విద్యార్థులకు అవగాహన సదస్సు…. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజు గౌడ్.. 

న్యూస్ 9 tv

మంథని

(సెప్టెంబర్ 30)

మంథని డివిజన్ పరిధి రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల యందు రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్, పెద్దపల్లి డిసిపి డాక్టర్ చేతన ఐపీఎస్, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్ ఆదేశాలతో రామగిరి ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యార్థినీ లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ,100 నంబర్ కు కాల్స్,షీ టీం పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు మాట్లాడుతూ విద్యార్థినిలు తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అట్టి లక్ష్యం నెరవేరేవరకు కష్టపడి చదివి, తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

విద్యార్థినిలు సెల్ఫోన్లను ఎక్కువగా వాడకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిని వాడకూడదని వాటి వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ మిమ్మల్ని ఏమైనా ప్రలోభాలకు గురిచేసిన వెంటనే1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని మరియు వాట్సాప్ డీపీలో తమ ఫోటోలు పెట్టుకోకూడదని వాటి వల్ల జరిగే అనర్థాలు గురించి వివరించడమైనది. ఎవరైనా ఆకతాయిలు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కళాశాల చుట్టుపక్కఆవరణలో ఎవరైనా మద్యం సేవించినట్లయితే వెంటనే 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమం లో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు గౌడ్, రామగిరి ఎస్ ఐ చంద్ర కుమార్, విద్యార్టినిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.