బిజెపి ప్రముఖ నేతలచే జొన్నాడ తారకరామా కాలనీ కమిటీ హాల్ నందు నంది అవార్డు గ్రహీత

బిజెపి ప్రముఖ నేతలచే జొన్నాడ తారకరామా కాలనీ కమిటీ హాల్ నందు నంది అవార్డు గ్రహీత ఆనం వెంకన్న ఘనంగా సన్మాన కార్యక్రమం! కొత్తపేట నియోజవర్గం ఇన్చార్జ్ అయినవిల్లి సతీష్ గౌడ్ బిజెపి టీం సభ్యుల అభినందనలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని, ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ నందు తారకరామా కాలనీ నందు కొత్తగా నిర్మించిన బిసి కమిటీ హాల్ ప్రాంగణంలో ఈరోజు బిజెపి జాతీయ శ్రేణులతో కలిసి కొత్తపేట నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ అయినవిల్లి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం నంది అవార్డు గ్రహీత అనేం వెంకన్నను పలువురు ప్రముఖ బిజెపి నేతలు ఘనంగా సన్మానం చేసి ఉన్నారు. ఈరోజు జొన్నాడ గ్రామం నందు బిజెపి కార్యవర్గం సభ్యులు పలువురు హాజరై పార్టీ యొక్క ప్రతిష్టతకు పోలింగ్ బూత్ కమిటీలకు, స్వశక్తి కిరణ్ అభ్యాన్ పేరిట ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు బిజెపి నేతలు పాల్గొని పలు చేపట్టబోయే కార్యక్రమాలను దిశా నిర్దేశం చేసి ఉన్నారు. ఈ సమావేశంనకు పలువురు బిజెపి ప్రముఖ నాయకులు ఆధ్వర్యంలో నంది అవార్డు గ్రహీత ఆనేం వెంకన్నకు ఘనంగా సన్మానం చేసి చిరు సత్కారం దుస్వాలువతో పూలమాలతో అభినందనలు తెలిపి ఉన్నారు.