Headlines

రేపు కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం మరియు మంగోల్ గ్రామాలలో మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పర్యటన

రేపు కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం మరియు మంగోల్ గ్రామాలలో
మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పర్యటన*

రేపు అనగా సోమవారం రోజున మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మల్లన సాగర్ ప్రాజెక్ట్ నుండి 540 MLD నీటి శుద్ధికరణ కేంద్రమునకు సరఫరా చేయు పంపుల ట్రయల్ రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ పాల్గొంటున్నారన్నారు,మంత్రివర్యులు హరీష్ రావు గారి మరియు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చేతుల మీదుగా ట్రయల్ రన్ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు తెలిపారు

మిషన్ భగీరథ కార్యక్రమంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి 540 MLD నీటి శుద్ధీకరణ కేంద్రమునకు సరఫరా చేయు పంపు ట్రయల్ రన్ ఏర్పాట్లను, పనులను పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి… ఈ కార్యక్రమంలో కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్,SE శ్రీనివాస్ చారి, అధికారులు DE రాజయ్యా,సుమలత AE లు, కుకునూర్ పల్లి ఎస్ఐ పుష్పరాజ్ తది తరులు ఉన్నారు,