Headlines

ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

 

అనంతపురంజిల్లా ,యాడికి :మండల కేంద్రం లోని జామియా మసీద్ లో ఆదివారం ముస్లిం సోదరులకు జామియా మసీద్ ముత్తు వల్లి చిక్కేపల్లి ఫకృద్దీన్ ఇప్తార్ విందు ఏర్పాటు చేసారు.ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ ఉపవాస దీక్షపరులకు జమాత్ కు ఇప్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా చిక్కేపల్లి ఫకృద్దీన్ మాట్లాడుతూ ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసమని నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు ప్రత్యేక వంటకాలు ఆరగిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని’ సహర్’ అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ‘ ఇఫ్తార్’ అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో మీడుతురు వైస్ ముత్తు వల్లి , మహమ్మద్ రఫీ, రహమతుల్లా, సులేమాన్, హాజీవలి, నిజాముద్దీన్, కాదర్ వలి , హజీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.