Headlines

అత్యాధునిక సాంకేతిక పద్ధతుల కోసం విస్తృత పరిశోధనలు

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 24:

నిర్మాణ రంగంలో అత్యాదునిక సాంకేతిక పద్దతులను తీసుకురావడానికి దేశంలో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని ముంబై ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ ప్రకాష్ నంతగోపాలన్ తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లో “ఆధునిక నిర్మాణ వస్తువులు , అభ్యాసాల ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలు” అనే అంశంపై వారం రోజులపాటు (24 నుంచి 30 వరకు) నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను సోమవారం ప్రారంభించారు. ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెర్బ్ – డిఎస్‌టి సహకారంతో ఏపీ నిట్ నిర్వహిస్తుంది. కార్యక్రమ కన్వీనర్ గా సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.భరణీ దరన్, కో ఆర్డినేటర్ గా డాక్టర్ ఎస్.ఎం సుబాని వ్యవహరించారు. ముఖ్య అతిధి ప్రకాష్ నంతగోపాలన్ మాట్లాడుతూ త్రీడి కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన కాంక్రీట్ నిర్మాణాలను తయారుచేయవచ్చని వివరించారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ నిర్మాణ రంగంలో నిష్ణాతులైన నిపుణుల ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడానికి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి ఈ వర్కుషాప్ ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ముందుగా జ్యోతిప్రజలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.ఆర్.కె శాస్త్రి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాదిపతి డాక్టర్ వి.సందీప్ , పలువురు విభాగాదిపతులు, ఆచార్యులతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు  పాల్గొన్నారు.