Headlines

పేదల ఆకలి కడుపులను నింపుతున్న బంగారు కృష్ణమూర్తి.

 

కదిరి, న్యూస్ 9 , అక్టోబర్ :30

కదిరి నివాసం ఉంటున్నటువంటి బంగారు క్రీష్టమూర్తి ఈయన ఒక పేద కుటుంబంలో జన్మించి, కండక్టర్ ఉద్యోగం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను ఎల్ఎల్బి చదివించి ఒక మంచి వ్యాపారవేతగా అత్యున్న స్థాయికి ఎదగడం గొప్ప విశేషం. బంగారు కృష్ణమూర్తి ఏ పేదవాడికి కష్టమొచ్చినా నీకు అండగా నేను ఉంటానని మనోధర్యాలను నింపి వారి కుటుంబాలకు అండగా నిలిచే వ్యక్తి బంగారు కృష్ణమూర్తి. ఆయన నిర్వహించే పనులు ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంగం యొక్క ఉప అధ్యక్షుడు, బంగారు కృష్ణమూర్తి వాల్మీకి జాతిని ఎస్టీ సాధన కోసం ఎన్నో ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, మరియు వాల్మీకి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడిపించిన వ్యక్తి బంగారు కృష్ణమూర్తి. అంతేకాకుండా కదిరి పట్టణం నందు పేదల కడుపు నింపడానికి గత ఏడు నెలలుగా తన సొంత ఖర్చులతో రోజుకు 200 మంది నుంచి 500 మంది దాకా ఉచిత భోజనం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వ్యవస్థాపకుడు బంగారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి ఒక్క సాధారణ వ్యాపారవేత్త, ఎటువంటి అధికారం లేని వ్యక్తి, అదే కదిరి పట్టణము నందు ఎంతోమంది ధనవంతుడు ఉన్నారు. వ్యాపారం వేతల ఉన్నారు, కానీ ప్రజలకు సహాయం చేయడానికి పేదవాడి కడుపు నింపడానికి ఎటువంటి వ్యాపారవేత ముందుకు రావడం లేదు. ఎటువంటి ధనవంతుడు ముందుకు రావడం లేదు. కృష్ణమూర్తి అన్న తన సొంత ఖర్చులతో తనకు ఉన్న కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. కృష్ణమూర్తి ఏ అధికారం లేనప్పుడే ఇటువంటి మంచి పనులు చేస్తున్నాడంటే రాబోయే కాలంలో ఏదైనా అధికారమిస్తే ఇంకా ఎంతో మంచి పనేలు చేయగలరని ప్రజలు కోరుకోవడం జరుగుతున్నది అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న పేద ప్రజలను విచారించగా ఇటువంటి ధర్మాత్ముడికి ఇటువంటి మనసున్న మారాజుకి ఏ పదవి ఇచ్చిన కూడా మునుముందు చాలా మంచి పనులు చేస్తాడని పేదలకు పేదల పక్షాన నిలబడి పేదలకు మంచి చేయగలరని అక్కడున్న ప్రజలు ఆశిస్తున్నారు.ఇటువంటి ధర్మాత్ముడికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని అక్కడున్న పేద ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ నేను ఒక కండక్టర్ గానే కాదు ఒక్క వ్యాపారంలో కూడా ఎదగడానికి ప్రజలే కారణమని ఆ ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాన్ని చేయడానికి నేను ముందు ఉంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పేదలకు సేవ చేసే విషయంలో నాకు ఎంతో సంతోషం ఉందని ఆ సంతోషం కోసమైనా పనిచేస్తానని చెప్పడం జరిగింది. అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ప్రజలందరూ నా గుండెల్లో ఉంటారని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.