Headlines

అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం మంజూరయ్యేలా చూడాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 21:

 

అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం మంజూరయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

 

మంగళవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జగనన్న కాలనీలకు అవసరమైన భూసేకరణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అర్హత కలిగి స్థలం మంజూరు కానీ వారు ఒక్కరు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. 90 రోజుల స్కీం కింద అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించి, అవసరమైన భూ సేకరణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డివిజన్ల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. సిద్ధాంతం, పెనుగొండ, తణుకు ప్రాంతాలలో భూ సేకరణ పై ఆరా తీశారు. పెద్దలంక లేఅవుట్ కు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూడాలని తెలిపారు. ఇప్పటికే కేటాయించిన లేఔట్ లకు వెళ్లడానికి అంగీకరించనివారి వివరాలను సేకరించాలన్నారు.

 

ఈ సమావేశంలో డిఆర్ఓ కె.కృష్ణవేణి, భీమవరం ఆర్డీవో కె.శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కె.చెన్నయ్య, హౌసింగ్ ఇంచార్జ్ పీడీ డా.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.