పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 30:
భీమవరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.డిసెంబర్ 8వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులకు విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. గురువారం ఈ సందర్భంగా హెలిపాడ్, సభా వేదిక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ సంయుక్తంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు తొలుత బుధవారం విష్ణు కాలేజీ మారుతి షోరూం దగ్గరలోని లేఅవుట్ ను పరిశీలించడం జరిగింది. ఈరోజు మరోమారు పరిశీలిన అనంతరం హేలీప్యాడ్ ను మున్సిపల్ కార్యాలయం ఆనుకుని ఉన్న లూధరన్ హై స్కూల్ నందు ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం జరిగింది. అలాగే సభా వేదికను బైపాస్ రోడ్ లోని గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వెనుక లేఔట్ నందు ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం జరిగింది.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో ఏ విధమైన మొక్కల తొలగింపుగాని, షాపులు మూసి ఉంచడం గాని చేయరాదని ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ సంయుక్తంగా ముఖ్యమంత్రి పర్యటనకు లూదరన్ హై స్కూల్ హెలిపాడ్ నుండి బైపాస్ రోడ్ లోని గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న సభా వేదిక చేరుకునే మార్గంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు తో చేసిన ట్రైల్ రన్ ను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి. శ్రీనివాస రాజు, జిల్లా రెవిన్యూ అధికారి బి శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె. శ్రీనివాసులు రాజు, జిల్లా వార్డు, సచివాలయాల అధికారి కెసిహెచ్ అప్పారావు, జిల్లా ఆర్ & బి శాఖ అధికారి బి లోకేశ్వర రావు, కమీషనరు యం.శ్యామల, జిల్లా అగ్నిమాపకదళ అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి టి ఉమా మహేశ్వర రావు, జిల్లా సర్వే అధికారి కె జాషువా, డిఎఫ్ వో డి ఎ కిరణ్, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, ఎపిడి వి విజయ లక్ష్మి, డిఎస్పీ బి శ్రీనాథ్, భీమవరం తహాశీల్దారు వై రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.