బాలికలు మహిళాస్వీయ రక్షణ దిశగా కృషి చేయాలి వత్తలు పిలుపు..!

 

పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం, డిసెంబర్ 2:

 

బాలికలు, మహిళ ల స్వీయ రక్షణ రక్షణ , స్వావలంబన దిశగా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధవర్యంలో తాడేపల్లిగూడెం ఆదిత్య విద్యా సంస్థ ప్రాంగణంలో శనివారం జరిగిన మహిళా సహసి స్వీయ రక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమo లో బిజెపి నియోజవర్గ కన్వీనర్ ఈత కోట తాతాజీ,

స్వావలంబ భారత్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాతాజీ మాట్లాడుతూ బాలికలు, మహిళలు స్వీయ రక్షణ, స్వావలంబన దిశగా అడుగులు వేయడం హర్షణీమన్నారు.

ఏ బి విపి వారి స్వీయ రక్షణ స్వావలంబన కోసం శిక్షణ నిర్వహించడం అభనందనీయమన్నారు. బోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఝాన్సి లక్ష్మీ బాయి , స్వామి వివేకానంద స్ఫూర్తి తో మహిళలు, విద్యార్థినులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదిత్య విద్యా సంస్థల ప్రిన్సిపాల్ వాసుదేవరావు

ఏ బివిపి భీమవరం విభగ్ ఇంఛార్జి పచ్చా గోపాల కృష్ణ తదితరులు మాట్లాడారు