బాధితులకు అండ__తెలుగుదేశం జెండా..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 2:

 

బాధితులకు అండగా తెలుగుదేశం జెండా ఉంటుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వలవల మల్లికార్జున రావు (బాబ్జి) అన్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం మండలం మోదుగుంట గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లును కోల్పోయిన బాధితులను బాబ్జి పరామర్శించారు. వారి కుటుంబ నేపథ్యం, పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రం నిరాశ్రయులకు బియ్యం, బట్టలు, వంట సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వలవల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బాధితులకు పక్కా ఇల్లు నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, రాష్ట్ర నాయకులు వాడపల్లి సుబ్బరాజు, పసలపూడి రాంబాబు, చిటికెన రాములు, గరగా మాణిక్యం, కామన శ్రీను తదితరులు ఉన్నారు