తుఫాను కారణంగా భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, డిసెంబర్ 2:

 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఆదివారం నుంచి 5వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అత్యవసర సహాయం కోసం భీమవరం కలెక్టరేట్లో 08816 299219 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.