Headlines

విద్యార్థులుగా మీరు పడే కష్టం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది -శ్రీ వాసవిలో రెండు రోజుల స్పెక్ట్రా 2కె24 ను ప్రారంభించిన డాక్టర్ యండమూరి.

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 2:

 

తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో రేపటి నుండి రెండు రోజుల పాటు *స్పెక్ట్ర 2K24* పేరుతో నిర్వహించనున్న సాంకేతిక ఉత్సవాన్ని ప్రముఖ నవలా రచయిత, చలన చిత్ర దర్శకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఏ పని చేసినా దానిని ఇష్ట పూర్వకంగా చేసినప్పుడే దాని ఫలితాన్ని సంతోషంగా ఆస్వాదించగలమన్నారు. విద్యార్థులుగా మీరు పడే నాలుగేళ్ళ కష్టం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని గుర్తించగలిగితే విజయం మీ సొంతం అవుతుందన్నారు. ఒకప్పుడు మీలాగా ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వారే మొక్కవోని దీక్షతో చదువుకుని ఇప్పుడు అత్యున్నత స్థాయికి ఎదిగారాని అందుకే విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా చక్కగా చదువుకోవాలని సూచించారు. చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా గమనిస్తూ ఉండాలని అప్పుడే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొగలిగే మానసిక ధైర్యాన్ని కలిగి ఉండగలరన్నారు. మీలో దాగి ఉన్న ప్రతిభను చాటుకోవడానికి ఉపయోగపడే ఇలాంటి టెక్ ఫెస్ట్ లలో పాల్గొని నూతన ఆవిష్కరణల దిశగా సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల పాలక వర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సబ్బారావు, ఉపాధ్యక్షులు కోట్ల వెంకట రామకృష్ణారావు, కోశాధికారి బాల కాశయ్య, టెక్నికల్ డైరక్టర్ చెక్కా అప్పారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నాకర్ రావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ రాంబాబు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.