Headlines

నందవరం మండలం జగ్గాపురం, బాపురం, గ్రామాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు…

న్యూస్ నైన్ టీవీ YGR

నందవరం మండలం జగ్గాపురం, బాపురం, గ్రామాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

 

28.04.2024 తేదీన నందవరం మండలం జగ్గాపురం, బాపురం గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ మీరు నాకు ఒక్క సారి అవకాశం ఇస్తే రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్య తీర్చి ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని. మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.

 

ఈ ప్రచారంలో బుట్టా శివ నీలకంఠ గారు,మండల అధ్యక్షులు బిఆర్ బసిరెడ్డి, శివారెడ్డి గౌడ్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు విరుపాక్షి రెడ్డి, కె.ఆర్ రామకోటేశ్వర్ రెడ్డి, నరహరి రెడ్డి, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.