సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి… గ్రామసభల ద్వారా ప్రజలకు దిశానిర్ధేశం..

న్యూస్.9) యాడికి

 

సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి… గ్రామసభల ద్వారా ప్రజలకు దిశానిర్ధేశం

 

ఎన్నికల వేళ… గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచనలు

 

ప్రశాంత ఎన్నికలే మాలక్ష్యం… స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

 

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో గ్రామసభలు నిర్వహిస్తున్న యాడికి సి.ఐ నాగార్జున రెడ్డి.

 

జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ఆయా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల వేళ ఎలా మెలగాలో గ్రామసభల ద్వారా ప్రజలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రశాంత ఎన్నికలే మాలక్ష్యం… స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు వేయమని సూచిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాలతో డీఎస్పీ గంగయ్య, యాడికి సి.ఐ,గ్రామసభలు నిర్వహించి ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.