Headlines

కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీన గన్పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.   తెలంగాణ…

Read More

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్..

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   పీర్జాదిగూడలో నాలుగు రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అయితే ఆమెకు సంబంధించినన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఠాగుట్టు రట్టయింది….

Read More

షాకింగ్ ఆధారాలతో కవిత సాధారణమహిళ కాదన్న ఈడీ, సీబీఐ..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా కవితకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తమ వాదనలను వినిపించింది. ఈ వాదనలలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.   రెండు రోజుల్లో నాలుగు ఫోన్లు ఫార్మాట్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం…

Read More

జయజయహే తెలంగాణా.. ఏపీ వర్సెస్ తెలంగాణా..

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించి విడుదల చేయాలని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో దుమారం మొదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి కంపోజ్ చేసేందుకు ఇవ్వడం పట్ల తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.   కీరవాణి తెలంగాణా రాష్ట్ర గీత వివాదం రేవంత్ రెడ్డి…

Read More

తెలంగాణ లోగోలు ఇవే..!

జూన్ 2వ తేదీన ఆవిర్భావ దశమ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.   ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశ…

Read More

మంత్రివర్గం నుంచి సీతక్క ఔట్ – కీలక పదవి, రేవంత్ ఛాయిస్..!?

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తరువాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ, పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్..సీఎంగా రేవంత్ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇక..ఎన్నికలు పూర్తి కావటంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైంది.   నూతన పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్…

Read More

రేవంత్ కేబినెట్ లో కొత్త మంత్రులు..

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చాలా రోజులుగా ఆశావాహులు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన అడుగులు పడుతున్నాయి. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.   కేబినెట్ విస్తరణ .పంచాయితీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ…

Read More

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూ వివాదంలో ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూమిని కబ్జా చేసి, అనుచరులతో తనను బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   అయితే, ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని ఆయన…

Read More

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి..!

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది.   తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు…

Read More

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కు బెయిల్ రావడం పట్ల భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, నీలం భార్గవ్ లను గురువారం వారు కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాజపా నేతలు సంతోష్, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కు బెయిల్ రావడం పట్ల భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, నీలం భార్గవ్ లను గురువారం వారు కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాజపా నేతలు సంతోష్, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More