Headlines

కేంద్ర మంత్రి అమిత్ షాతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన సొంత పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది) పట్ల కొంత అసంతృప్తితో వున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారాయన.

ఈ క్రమంలోనే ఆయన పదే పదే బలప్రదర్శనకు దిగుతున్నారు రాజకీయంగా. 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ.. ఈనెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. అదే రోజున ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభను ఖమ్మంలోనే నిర్వహిస్తుండడం గమనార్హం. బీజేపీలో పొంగులేటి చేరిక దాదాపు ఖాయమైపోయిందనీ, 18నే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారనీ తెలుస్తోంది. వరుసగా ముఖ్య అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీలు నిర్వహిస్తున్నారు. మరోపక్క, నేరుగా బీజేపీ అధిష్టానంతో శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరుపుతుండడం గమనార్హం.