లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్.. బండి సంజయ్..

త్వరలోనే లక్షలాది మందితో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ చేపడుతామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో బండిసంజయ్ పాల్గొన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో 30 లక్షల మంది జీవితాలు నాశమయ్యాయని విమర్శించారు.

ను కేటీఆర్ నాశనం చేశారని విమర్శించారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నష్టపోయిన 30 లక్షల అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరో ఐదు నెలల్లో బీజేపీ అధికారంలోకి వస్తదని చెప్పిన బండి సంజయ్.. బిశ్వాల్ కమిటీ చెప్పిన నివేదిక ప్రకారం తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతామని అన్నారు. అలాగే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చాడు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత భరోసా లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు ప్రకటిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే ఏడు వేల మందికే ఇండ్లను కేటాయించినట్ల చెప్పినట్లు తెలిపారు.పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం పేదల కోసం మంజూరు చేస్తున్న ఇండ్లను పేదలకు అందించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని బండి సంజయ్ డిమాండే చేశారు. కేసీఆర్కు రాబడి మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

పదో తరగతి పరీక్ష లీక్ లేశాడని బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. మునుగోడు లో డబ్బు, మద్యం తో గెలిచారని అన్నారు. ఒక్కో ఓటర్ కు 5 వేలు, మద్యం పంపిణీ చేశారని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ కోసమే సచివాలయం కట్టుకున్నారని..అందులో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదన్నారు. సచివాలయ వ్యయం రూ. 400 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు ఎలా పెరిగిందన్నారు.

మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని…ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించే బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వస్తే ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ .. ఇంత వరకు ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.