Headlines

తండ్రి కాబోతున్న రామ్ చరణ్, చిరు ట్వీట్ వైరల్!

మెగా అభిమానుల (Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), భార్య ఉపాసన (Upasana) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ నటుడు తాము మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. ఈ మేరకు రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కొణిదెల, ఉపాసన తల్లిదండ్రులు శోభన, అనిల్ కామినేని ట్విట్టర్ లో స్పష్టం చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి (Megastar chiru) ”తాను తాతను కాబోతున్నానంటూ” చేసిన ట్వీట్ టాలీవుడ్ సర్కిల్…

Read More

పవన్‌ కళ్యాణ్‌ “వారా‍హి” రిజిస్ట్రేషన్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనంపై గత కొద్ది రోజులుగా ఏపీలో రగడ జరుగుతోంది. యుద్ధానికి సిద్ధం అంటూ కొద్ది రోజుల క్రితం ట్విట్టర్‌లో తన ప్రచార రథం ఫోటోలను బయట పెట్టడంతో రగడ మొదలైంది. ఏపీలో అధికార వైసీపీకి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్‌పై దూకుడుగా విమర్శలు చేశారు. మాజీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్‌పై ఘాటైన విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా పవన్‌ కూడా కౌంటర్ ఇచ్చారు. పవన్‌…

Read More

ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రత

మాండూస్ తుపాను(Mandous Cyclone) బాధితులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) సాయాన్ని విడుదల చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయం అందుకోనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు(Nellore), తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సాఅర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ఎలాంటి నష్టం జరగుకుండా తుపానుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మాండూస్(Mandous) తుపాను…

Read More

ఆరోగ్య రంగంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ కి అవార్డులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, భవిష్యత్తులోనూ సాధ్యం కాదనేలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో యూపీలోని వారణాసిలో యూనివర్సల్ హెల్త్ కవరేజి డే వేడుకలను శనివారం ప్రారంభించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో పాటు దేశంలోని ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులంతా హాజరయ్యారు. సదస్సులో భాగంగా మూడు అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం…

Read More

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాదు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామనీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం ఆందోళన కలిగించిందనీ, వరంగల్‌కి సంబంధించి ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం బాధగా వుందనీ కొండా సురేఖ వాపోయారు. తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రాధాన్యత కల్పించడమంటే తనను అవమానపరచడమేనని కొండా సురేఖ ఆవేదన…

Read More

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సుఖ్వీందర్ గతంలో పీసీసీ చీఫ్‌గా పని చేయగా, అగ్నిహోత్రి గతంలో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వీరితో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిమ్లాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ,…

Read More

ఇక పుష్ప2 సినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప మూవీ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. అంచనాలు లేకుండా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. హిందీలో అయితే అసలు రిలీజ్ చేయొద్దని తొలుత భావించారట. కానీ అక్కడే సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌ కోసం సర్వం సిద్ధమవుతోంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ డైలాగులు, నటన,…

Read More

తెలంగాణ(Telangana)పై పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఫోకస్

తెలంగాణ(Telangana)పై పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఫోకస్ చేస్తోంది. గతంలో తెలంగాణ జనసైనికులతో పవన్ భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. ఇప్పటికే పవన్ ఆదేశించారు. దీంతో 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. తెలంగాణ రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేయనున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మేరకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే.. 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను…

Read More

డిసెంబర్‌ 12న ఉపాధ్యాయుల బదిలీలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై దాదాపు ఏడెనిమిది నెలలుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే బదిలీలు చేపడతారని భావించినా రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించడానికి ప్రభుత్వం అమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలపై వరుసగా సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 12న ఉపాధ్యాయుల బదిలీలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జనవరిలోగా బదిలీ…

Read More

APలో విస్తారంగా వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను తీరం దాటింది. మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటినా దాని ప్రభుత్వం ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా పడింది. చెన్నైతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 26జిల్లాల్లో మాండౌస్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మాండూస్ తుఫాన్ తీరం దాటింది. రాత్రి 1:30 గంటలకు…

Read More