Headlines

CM Jagan ప్లాన్.. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులు

వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వైనాట్ 175 నినాదాన్ని నిజం చేయాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ ఆవుతున్నారు. వైసీపీ పార్టీ నేతలతో సమావేశమై.. కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు కూడా వచ్చారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు కీలక ఆదేశాలిచ్చారు జగన్. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలని చెప్పారు. ప్రతి సచివాలయం…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ యాత్ర చేయబోతున్న బస్సు రెడీ అయింది. జనసేనాని యాత్ర చేయబోతున్న బస్సుకి వారాహి అని పేరు పెట్టారు. వారాహికి రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళికి సన్నిహితుడైన…

Read More

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళుతోంది. గురువారం ఉదయం నుంచి వెల్లడవుతున్న ఫలితాల్లో ఆ పార్టీ ఘన విజయం సాదించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీకి చెందిన అభ్యర్థులు ఏకంగా 158 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత 2002లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 127 సీట్లను గెలుచుకుంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డుగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ రికార్డు చెరిగిపోయింది….

Read More

గుజరాత్ ఎన్నికల ఫలితాలు: cricketer జడేజా భార్య గెలుపు

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మరోమారు విజయభేరీని మోగించింది. బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఏమాత్రం గట్టిపోటీని ఇవ్వలేక పోయారు. ఫలితంగా 182 సీట్లకు గాను ఏకంగా 150కి పైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో క్రికెట్ రవీంధ్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈమె తన సమీప ప్రత్యర్థిపై 50 వేల పైచిలుకు…

Read More

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం విజయం.. మోడీ రికార్డు బద్ధలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల…

Read More

టీఆర్ఎస్ పార్టీ(TRS Party)ని బీఆర్ఎస్(BRS)గా పేరు మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం

టీఆర్ఎస్ పార్టీ(TRS Party)ని బీఆర్ఎస్(BRS)గా పేరు మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసింది. బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. భారత రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం… కేసీఆర్ కు లేఖ పంపింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాన్ని కేసీఆర్(KCR) నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో శుక్రవారం కార్యక్రమం జరగనుంది. అదే సమయంలో…

Read More

విజయవాడకు సీఎం జగన్…జయహో బీసీ మహాసభ..

బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ​ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను తలపెట్టారు. సీఎం షెడ్యూల్… ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు సీఎం జగన్ చేతుల మీదుగా సభను ప్రారంభిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు,…

Read More

ఏపీనే టాప్ ప్లేసులో…

ఐదేళ్ల కాలంలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసుల్లో(CBI Cases) ఏపీనే టాప్ ప్లేసులో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. లోక్ సభ(Lok Sabha)లో ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు డీవోపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017 నుంచి 2021 వరకు చూస్తే.. ఏపీలో 10 సిబీఐ కేసులు నమోదయ్యాయని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ(Kerala)లో ఆరు కేసులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో 5 సీబీఐ…

Read More

ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున 7 ఉద్యోగ సంఘాల నేతలు.. మంత్రుల కమిటీ సమావేశానికి డుమ్మా

ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(contributory pension scheme) ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున 7 ఉద్యోగ సంఘాల నేతలు.. మంత్రుల కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల(Employee Unions) నేతలు డిమాండ్ చేస్తుంటే.. ఆ ఒక్కటి అడగొద్దు అని ప్రభుత్వం అంటోంది. దీనిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రులతో సమావేశం జరిగింది. కానీ ఏడు ఉద్యోగ…

Read More

వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇటీవల తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ దగ్గర ఆందోళన చేయాలనుకున్న షర్మిలను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షర్మిలకు చాలామంది రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఆమె అరెస్టు తీరు పట్ల అంతటా ఖండనలు వచ్చాయి. రాష్ట్ర గవర్నర్ కూడా షర్మిల అరెస్టు తీరు పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాని ఫోన్…

Read More