ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఓ హోటల్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Met India cricketers) కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస విజయాలతో 2023లో టీం ఇండియా పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది. టీమిండియా.. వన్డే క్రికెట్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది.
తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ODIలో రోహిత్ శర్మ జట్టు ఈ రికార్డుని సాధించింది. ఇక.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గతేడాది ముందు వరకు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత మాత్రం తారక్ పేరు మార్మోగిపోయింది. వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచి మన సినీ సెలబ్రిటీల వరకు ఇప్పటికీ మెచ్చుకుంటూనే ఉన్నారు. అలా తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న ఎన్టీఆర్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక న్యూజిలాండ్ తో జనవరి 18న టీమిండియా తొలి వన్డే ఆడనుంది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన క్రికెటర్లు.. ఎన్టీఆర్ ని కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.